షర్మిళ జగన్ మీద ఎడతెరపి లేకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. యాత్ర 2 మూవీ విడుదల కానున్న సమయం లో ఆ మూవీ లో చూపిన అబద్ధాలన్నీ కడిగేసేలా షర్మిల ఒక దాని తరువాత ఒకటి ప్రశనల్ వర్షం కురిపించారు. “జగన్ పులా? సింహం ఆ? కనీసం పరిపాలన చేతనయ్యిందా?” అని విరుచుకుపడ్డారు.
అసలు మీకు ఏం చేతనవుతుంది? కేవలం బూతులు తిడుతూ, సొంత ఆడబిడ్డను బజారుకీడుస్తున్నారు. వ్యక్తిగతం గా దూషనణలు చేస్తున్నారు. ఇదే వచ్చా మీకు?
షర్మిళ మాటల్లో…
[జగన్ ను] పులీ సింహం అని పొగుడుతారు? ఎవరికి సింహం? ఎవరికి పులి? ఏం ఉద్ధరించారు? దమ్ముంటే బీజేపీ మీద గర్జించండి దమ్ముంటే.
ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదే? ఒక్క ఉద్యమాన్ని కనీసం ముందుకొచ్చి చేయలేదే? చరిత్ర క్షమిస్తుందా? అసలు మీకు ఏం చేతనవుతుంది? కేవలం బూతులు తిడుతూ, సొంత ఆడబిడ్డను బజారుకీడుస్తున్నారు. వ్యక్తిగతం గా దూషనణలు చేస్తున్నారు. ఇదే వచ్చా మీకు?
మీకు పోలవరం సాధించటం చేతనయ్యిందా? స్పెషల్ స్టేటస్ సాధించటం చేతనయ్యిందా? మీకు రాజధాని సాధించటం చేయనయ్యిందా? మీకు పరిపాలన చేతనయ్యిందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా?
Ila anesindhi entra 😂🤣😂 pic.twitter.com/FEr5oD5pJO
— 🦋🌸RaG భాగ్య నగరం పిల్ల (@RN_PSPK) February 8, 2024