ఆడవారికి అవమానకరంగా దరిద్రపు డ్యాన్సులతో వైయెస్సార్సీపీ ప్రచారం

ఆడవారికి అవమానకరంగా దరిద్రపు డ్యాన్సులతో వైయెస్సార్సీపీ ప్రచారం

వైయెస్సార్సీపీ ప్రభుత్వ తీరు ఐదేళ్లు ఎంత నవ్వులపాలయ్యేలా ఉందో తెలియని ఆంధ్ర ప్రజలు లేరు. వైయెస్సార్సీపీ నాయకులు ప్రతిపక్షనాయకులనూ, పవన్ కల్యాణ్ గారినీ, వారి ఇండ్లలో ఉండే ఆడవళ్లనీ ఎన్నెన్ని దుర్భాషలాడారొ తెలియని ప్రజానీకం లేరు. వాటి గురించిన ప్రస్తావనే ఎంతో అసహ్యం గా ఉంటుంది. ఇలాంటి అసహ్యకరపు ప్రహసనాన్ని వైయెస్సార్సీపీ నాయకులు ఏళ్లకొద్దీ సాగించారు.

ఈ ప్రవర్తన తో వారికి ఆడవారి పట్ల, సమాజం పట్ల ఉన్న నీచమైన విలువల్ని తెలిపాయి.

అంతే కాకుండా… ఇవి ప్రచారం సాగుతున్న రోజులు. పవన్ కల్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారూ రాష్ట్రాన్ని ఏ విధం గా అభివృద్ధి చేస్తాం అని చెప్తూ ఉంటే వైయెస్సార్సీపీ ప్రభుత్వం ఏ విధం గా ఫ్రీస్కీములనిస్తుందో వివరిస్తున్నాయి. వారికి అభివృద్ధీ పట్టలేదు.

ఈ మధ్య ఒక వైయెస్సార్సీపీ నాయకుడు తన ప్రచారాన్నీ - తంతు లో తంతు - తన జన్మదినాన్ని రికార్డింగు డ్యాన్సుల తో సంబరం చేస్కున్నాడు. అదీ రోడ్డు మీద.

రాష్ట్ర ప్రభుత్వం మారాలని ఆసిద్దాం. మనకి, మన ప్రజలకీ మంచి రోజులు రావాలి కదా.