జగన్ విసుగు చెందిన ప్రవర్తనకు, అర్ధం లేని పనులకు పరాకాష్ట ‘సిద్ధం” క్యాంపైనింగ్ సభ అని తెలుగు ప్రజలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు.
సిద్ధం సభలో జగన్ సంఖారావం అభాసు పాలయ్యింది. తన వెనుక శంఖారవ ఆడియో ని ప్లే చేశారు. కానీ జగన్ ఆ ఆడియో కి అనుగుణంగా శంఖారావం చేయలేదు. దానితో జగన్ శంఖం ఊదటం ఆపాక కూడా ఆ ఆడియో ప్లే అవుతూ ఉండటం తో తన పరువు తనే తగ్గించుకొని అభాసు పాలయినట్లు తెలుగు ప్రజలు ట్విటర్ వేదికగా జోకులు పేలుస్తున్నారు.
తన వక్రబుద్ధి పరాకాష్ట కు చేరి శునకానందాన్ని అనుభవించే స్థాయి కి చేరిందనీ… “సిద్ధం” సభ దానికి వేదికగా మారిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ రూపంలో ఉన్న ఒక క్యారికేచర్ పెయింటింగ్ ముందు ఒక పంచింగ్ బ్యాగ్ ను పెట్టి… వైసీపీ కార్యకర్తలకూ, వాలంటీర్లకూ దానిని గుద్దే అవకాశాన్ని కల్పించారు. ఇంతకంటే దిగజారిన మనస్తత్వం, ఆలోచనలు ఆ సీయెం స్థాయికి తగవని తెలుగు ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఇదేమి శునకానందం @ysjagan ?
— SKY (@SriKanthY_) January 27, 2024
pic.twitter.com/VoSPPzrf6Q
- Krishna Reddy