విజయవాడలోని APCC ఆఫీస్ లో రిపబ్లిక్ వేడుకలలో పాల్గొన్న షర్మిల జగన్ మీద తీవ్రం గా విమర్శలు చేశారు.
షర్మిల మాట్లాడుతూ…
తను 2019 తరువాత ఒకే ఒక్కసారి తాడేపల్లి లో ఉన్న జగన్ ఇంటికి వెళ్లానని, నా ఆస్తి నాకు ఇవ్వమన్నందుకు జగన్ తన మీద గొంతు పట్టుకొని గోడకేసి గుద్దాడని, దానికి సాక్ష్యం గా వాళ్ల ఇద్దరినీ కని పెంచిన తల్లి విజయమ్మ ఉందని అన్నారు. అంతేకాక ఎవరైనా సరే తన తల్లిని ఈ విషయాన్ని అడగొచ్చని అన్నారు.
ఈ వార్త వచ్చిన మరుక్షణం సామాజిక-మాద్యమాలు విపరీతం గా జగన్ చర్యలను ఖండించాయి. అంతే కాక - జగన్ అవినీతి పాలన పై ఏ చిన్న ప్రశ్న అడిగినా పవన్ కల్యాణ్ గారి పెళ్లిల్ల ప్రస్తావన తెచ్చే జగన్… ఇప్పుడు ఈ విషయం గురించి అడిగినా అదే పెల్లిళ్ల ప్రస్తావ తెస్తాడని జోకులేస్తున్నారు.
ప్రజల అభిప్రాయం ఏంటంటే… ఒక సీయెం ఇంత కన్నా ఎప్పుడైనా గౌరవం కోల్పోయారా అని? అదీ కాక చెల్లి పై చేయి చేసుకునే మనిషి మన సీయెం ఆ అని అభి ప్రాయపడుతున్నారు.