టీ గ్లాస్ - సంతోషం, అభివృద్ధి.

టీ గ్లాస్ - సంతోషం, అభివృద్ధి.

పాలనలో ఉన్నప్పుడు జగన్ ఏ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టలేదు. అలాంటిది ఆకస్మికంగా సిద్ధం అని బయటికొచ్చి ఫ్రీస్కీములిస్తుంటే సరికి వాళ్ల వాలంటీర్లకు వొళ్లూ పై తెలియకుండా మీం లు వేస్తున్నారు. టీ గ్లాస్ పగిలిందనీ, సింక్ లో ఉండాలనీ.

కానీ రైతు ఆత్మహత్యల గురించీ, “ఫ్యాను” కు వేసుకున్న ఉరి గురించీ ఎవరూ మాట్లాడరేం? 4 ఏళ్ల నుంచీ పెరిగిపోయిన ప్రతీ నిత్యావసర వస్తువులూ, సిలిండరూ, నూనె, పప్పులూ, ఉప్పులూ, కరెంటు చార్గీలూ… వాటి గురించి ఏ ఒక్క మీం రాలేదా?

వచ్చింది. ట్విటర్ వేదికగా జనసేన సపోర్టర్లూ, టీడీపీ సపోర్టర్లూ ఊరికే ఉండరు కదా?