మళ్లీ మళ్లీ తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్న YSRCP?

99% వాగ్దానాలు అమలా? జనాలు నవ్వుతున్నారు!
మళ్లీ మళ్లీ తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తున్న YSRCP?

తప్పుడు న్యూస్ చెప్పటానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం YSRCP కి చాలా ఉన్నట్టుందని ప్రజల ఆలోచన.

YSRCP ట్విటర్ లో వారి అధికారిక హ్యాండిల్ ద్వారా 99% హామీలను అమలుపరచినట్టు గా పేర్కొన్నారు. ఇంతకంటే దారుణమైన అబద్ధం ఉండదని విచ్చలవిడిగా comment కొడుతున్నారు ప్రజలు. అదీ కాక ఇది WhatsApp గ్రూపుల్లో తెగ తిరిగేస్తోంది దీని గురించిన చర్చ.

అసలు 99% హామీలను అమలు చేశారని ఏ ధైర్యం తో చెప్పారో అర్ధం కాక జనాలు తల గోక్కుంటున్నారు. మళ్లీ సిద్ధం సభలట. వేరే కొత్త హామీలు చేయాలి కదా నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి ఏమీ చేయక పోయాక?