Opinion: పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా చేసిన కొన్ని మంచి పనులు

పవన్ కల్యాణే మన CM ఐతే ఎంత బాగుండు అనిపిస్తుంది వీటిని చూశాక. చదవండి. చదివించండి.
Opinion: పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా చేసిన కొన్ని మంచి పనులు

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతీ పార్టీ కి “mouth piece” పత్రికలు, చానెళ్లూ ఉన్నాయి. ఎదుటి పార్టీ మీద దుమ్మెత్తి పోసే పత్రికలు, చానెళ్లు పవన్ కల్యాణ్ గారు చేస్తున్న, చేసిన మంచి పనులను ఒక్కటి కూడా చూపవు. పవన్ కల్యాణ్ గారు చేసిన మంచి పనులను యువత ముందు తేవటమే ఈ ఆర్టికిల్ ముఖ్య ఉద్దేశ్యం.


  • పవన్ కల్యాణ్ అనే పేరు స్ఫూర్తి కి నిదర్శనం.
  • పోరాటానికి మరో పేరు.
  • అపజయాన్ని ఎదుర్కొని ఇంకా ధైర్యం గా ఎలా నిలపడాలో యువకులుకు నిదర్శనం గా కనపడే నిలువెత్తు రూపం.
  • అధికారాన్ని నిలపెట్టుకోవటం కోసం యువకులను మభ్యపెట్టి తక్కువ జీతాలకు, వాలంటీర్లు గా చేసి వారి ఉన్నతిని, అభ్యుదయాన్ని ఆపేసే స్వార్ధపరులైన నాయకులను ప్రశ్నించే ధైర్యాన్ని రాష్ట్ర యువత గుండెల నిండా నింపిన అసలైన నాయకుడు.
  • అధికార పార్టీ చేసే ఆకృత్యాలను, అవినీతిని, దుర్మార్గమైన పనులను, ప్రజల హక్కుల కు భంగం కలిగించే జీవో లను ప్రశ్నించిన అరుదైన నాయకుడు.

అధికారం లో ఉండి కూడా నాలుగున్నర సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని బూడిదలో కలిపి, యువకులను సోమరులను చేసి, మద్యం పోసి, Free Scheme లను ఇచ్చి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమయం లో మళ్లీ హామీలను గుప్పిస్తున్న నాయకుడు కాదు. నిరంతరం గా రాష్ట్రం అంతటా ఎన్నో ఏళ్లు గా సభలను, వారాహి యాత్రలను జరిపిన అసలు సిసలైన శ్రమించే నాయకుడు.

ఆయన చేసిన కొన్ని అత్యంత గొప్ప పనులలో కొన్నిటిని మీ ముందుకు తెస్తున్నాను. ఇవి చదివాక నాకు గట్టి గా అనిపించింది…

మన పవన్ కల్యాణే CM ఐతే? మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 2 లక్షల కోట్లు, మన ‘ఓటుకి డబ్బు ఇచ్చి మనల్ని మోసం చేయరు. మన 2 లక్షల కోట్లు మన అభివృద్ధికి ఖర్చు పెడతారు.

1. 1993 లో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెలి పెండ్లికి రూ॥ 1 లక్ష
2. తొలిప్రేమ సినిమా సమయంలో VCR అనాథ ఆశ్రమంకు ఆర్థిక సహాయం
3. 1995 మూవీ షూటింగ్ ప్రమాదంలో పరణించిన వ్యక్తి ఫ్యామిలీకి రూ.1 లక్ష
4. 1990 లో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు రూ 1. లక్ష సాయం
5. ఆనంద సాయి గారికి రూ లక్ష సాయం
6. 2005 లో సునామీ బాధితులకు బాబు ప్రాందసీ ద్వారా సహాయం
7. స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమానికి 25 వేలు
8. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి 3 నీటి బోర్లు ఏర్పాటు
9. రీఫైల్ షూటర్ రేఖకు రూ 5 లక్షలు సహాయం
10. యాక్టర్ పావలా శ్యామలకు రూ. లక్ష సహాయం
11. U-19 క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీదుకు రూ. 2 లక్షలు
12. అత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి 8 లక్షల 50 వేలు
13. జన సేన పార్టీ కార్యకర్తల ప్రమాద భీమా కోసం రూ॥ 1 కోటి
14. ఇప్పటం గ్రామ పంచాయితీ అభివృద్ధికి రూ॥50 లక్షలు
15. దారుణ హత్యకు గురైన చైత్ర కుటుంబానికి రూ. 2.5 లక్షలు
16. కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం
17. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయి రూ 2 లక్షలు
18. ఉత్తరాఖాంద్ వరవ సమయంలో బాధితులకి 24 లక్షలు
19. ఆంధ్రుల క్రికెట్ ఒక్కో జట్టుకు లక్ష ఇచ్చారు.
20. అనాధ పిల్లలకోసం 16,25,000 విరాళం ఇచ్చారు.
21. అంధుల క్రికెట్ బోర్డు నడిపేవారికి రూ॥ 10 లక్షలు ఇచ్చారు.
22. రైతు సంక్షేమం కోసం రూ॥ 5 కోట్లు విరాళం
23. ఆర్మీ సంక్షేమానికి రూ॥ కోటి విరాళం
24. కరుణ శ్రీనివాస్ కు॥ 50 వేలు సహాయం
25. ఖమ్మం వృద్ధాశ్రమానికి 1 లక్ష విరాళం
26. హుద్ హూద్ తుఫాన్ బాధితులకు రూ. 50 లక్షలు.
27. గోపాల గోపాల సినిమా టైంలో అభిమానికి రూ. 50 వేలు
28. ఆనారోగ్యంతో ఉన్న కెమరామెన్ భార్యకు రూ॥ 25 లక్షలు
29. ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడీ గోటా సతీష్ కు రూ॥ 5 లక్షలు
30. జీవన్ అనాథ ఆశ్రమంకు 1 లక్ష సహాయం
31. కొండగట్టు అంజనేయస్వామి ఆలయానికి రూ. 11 లక్షలు
32. ఆధారోగ్యంతో ఉన్న అభిమాని గుబ్బాల సతీష్ కు లక్ష
33. దివ్యాంగుల క్రికెట్ టీమ్స్ కు 5 లక్షలు ఆర్థిక సహాయం
34. కడవ U-19 మహిళా క్రికెటర్సుకు కిట్స్ పంపిణీ
35. కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ కి రూ. 10 లక్షలు
36. క్యాన్సర్ తో బాధపడుతున్న విశ్వతేజకు రూ॥ 2 లక్షలు
37. CMRF కి 1 కోటి విరాళం
38. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని ఫ్యామిలికి సాయం
39. కేరళ వరద బాధితులకు 2 కోట్లు ఆర్థిక సహాయం
40. ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చికి రూ. 10 లక్షలు
41. రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ ఫ్యామిలీకి 1లక్ష
42. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి రూ. 1 లక్ష
43. చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం రూ. 2 కోట్లు
44. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సు నిర్వహణ కోసం రూ. 1 కోటి
45. కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి
46. దామోదరం సంజీవయ్య స్మారక భవణ నిర్మాణానికి రూ. 1 కోటి
47. హైదరాబాద్ వరదల టైంలో బాధితుల కోసం రూ 1 కోటి
48. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు రూ॥ 50 లక్షలు
49. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వమునకు రూ.50 లక్షలు
50. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వమునకు రూ॥ 1 కోటి
51. శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి 1.32 కోట్లు
52. ఆరోగ్యధీమా డ్రైవ్ కోసం తాను వ్యక్తిగతంగా కూ॥ 1 కోటి
53. జనసేన పార్టీకి 5 కోట్లు
54. CPF Organisation కోసం 1 కోటి చెక్ వ్రాసి ఇచ్చినారు.
55. మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయం
56. అయోధ్య ఆలయ నిర్మాణంకోసం రూ 10 లక్షలు
57. క్రియాశీలక సభ్యత్వం కోసం రూ. 2 కోట్లు ఆర్థిక సహాయం
58. మరణించిన పార్టీ కార్యకర్త మురళీకృష్ణ ఫ్యామిలీకి మా॥ 2.5 లక్షలు.
59. బంగారం షూటింగ్ టైంలో ఎవరో భార్యాభర్తలు వాళ్ళ బిడ్డకు హెల్త్ ప్రాబ్లెం కోసం వస్తే ఆ బిడ్డను హాస్పిటల్లో చేర్పించి చాలా నెలలపాటు హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఇచ్చారు.
60. ప్రత్యేక హోదాకోసం ప్రాణాలర్పించిన మునికోటి ఫ్యామిలికి రూ 2 లక్షలు
61. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగయ్య కు 1 లక్ష
62. జానీ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బుని తిరిగి ఇచ్చారు.
63. కొమరం పులి సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన డబ్బుని తిరిగి ఇచ్చారు.
64. బోర్డ్ ఆఫ్ డిసెబుల్ క్రికెట్ అసోసియేషన్ 8 లక్షలు విరాళం
65. అనంతపురంలోని చిన్నారులకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం
66. పేరు తెలియని వ్యక్తిని ఇంటికి పిలిచి సహాయం అందించినారు.
67. శేషేంద్రశర్మ ఆధునిక మహాభారతం పుస్తకం మలిముద్రణకు ఆర్థికసాయం
68. క్యాన్సర్ వ్యాధితో ఉన్న శ్రీజ కుటుంబానికి రూ॥ 2 లక్షలు
69. మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థికసాయం
70. క్యాన్సర్ వ్యాధితో ఉన్న భార్గవ్ కి రూ॥ 5లక్షలు సహాయం
71. అత్తారింటికి దారేది సినిమా చెక్ లో 70% డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కు ఛారిటీ
72. అన్నవరం టైంలో రోడ్డుప్రమాదంలో వ్యక్తిని ఇమేజ్ హాస్పిటల్ చేర్పించి ఆర్థిక సహాయం
73. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సహాయం, భవిష్యత్తు భరోసా, కుటుంబానికి అండదండలు
74. అత్తారింటికి దారేది మూవీ టైంలో జూనియర్ ఆర్టిస్టు కూతురు పెళ్ళి కోసం రూ. 1 లక్ష విరాళం
75. ప్రత్యేక ప్రతిభ కనబరచిన క్రికెటర్లకోసం నిర్వహించనున్న టి-20 క్రికెట్ టోర్నమెంటు కోసం 5లక్షలు విరాళం
76. పవన్ కళ్యాన్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ & 1 లక్ష
77. పనన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తనకోసం పనిచేస్తున్న వర్కర్స్ ఇన్సురెన్స్ కోసం రూ. 13.57 లక్షలు
78. వాయిద్య కళాకారుడు కిన్నెర కొగలయ్యకి 2లక్షలు
79. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన శేషగిరి 6నెలలు పాపకు వైరల్ ఫీవర్ తో బాధపడుతుంటే రెయిన్బో హాస్పిటల్లో చేర్పించి సహాయం
80. ఆత్మహత్య చేసుకున్న తాపి మేస్త్రి బ్రహ్మజీ ఫ్యామిలీకి రూ. 1 లక్ష
81. జల్సా సినిమా సూటింగ్ టైంలో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం
82. బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్ధిక సహాయం
83. పిఆర్పీ మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి రూ॥ 1.5 లక్షల పరిహారం
84. కిలిమంజారోను అధిరోహించిన అలా దళవాయికి 1.50 లక్షలు
85. మరొకసారి యాక్టర్ పావలా శ్యామలకు రూ.50 వేలు
86. అలియాస్ లోని వృద్ధాశ్రమానికి రూ. లక్ష విరాళం
87. అల్వాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన భూమిరెడ్డి కరాటే మాస్టరుకు ఆర్థిక సహాయం అందచేశారు.
88. అజ్ఞాతవాసి షూటింగ్ వారణాసిలో మరణించిన అజయ్ బాబుకు రూ.లక్ష వికారం
89. దేశభక్తి నిజామాబాద్ లో యువశక్తి సదస్సు నిర్వహించేందుకు స్వాతంత్ర్య సమరయోధుల బృందానికి 25 వేలు
90. సర్దార్ గబ్బర్సింగ్ సినిమా అసిస్టెంట్ కెమెరామెన్ రూ. 20 లక్షలు విరాళం
91. మెంటల్లీ రిటార్డెడ్ పాఠశాలకు భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు. ఇది వచ్చే 10 - 15 సంవత్సరాల ఆర్థిక అవసరాలకు ఆ పాఠశాలకు సరిపోతుంది.
92. వోల్వో బస్సు అగ్నిప్రమాదంలో మరణించిన అభిమాని వెంకటేష్ యాదవ్ కు 5 లక్షలు విరాళంగా ఇచ్చారు.
93. కరుణ శ్రీనివాస్ కురూ॥ 50 వేలు ఆర్థిక సహాయం
94. గుంటూరులో దశావతార వేంకటేశ్వర స్వామి గుడికి రూ॥ 1.32 కోట్లు
95. 2007లో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి హాస్పిటల్ ఖర్చులన్నీ చెల్లించారు.
96. తమ్ముడు ఆడియో క్యాసెట్ విడుదల సందర్భంగా సైనిక సంక్షేమbనిధికి రూ. లక్ష విరాళం
97. కరెంటు షాకుతో మరణించిన నాగన్నకు 6 లక్షలు విరాళం ఇచ్చి వారి పిల్లల భవిష్యత్తుకు హామీ ఇచ్చాడు
98. ఇప్పగం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ళు కోల్పోయినవారు, దెబ్బతిన్నవారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం
99. నెల్లూరు వైవాహిక కళల శిక్షకుడు మరియు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ శ్రీ ప్రభాకర్ రెడ్డిని సత్కరించారు. మరియు ఆర్ధిక సహాయం అందించారు.
100. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 30 కోట్లు భారీ ఆర్థిక సహాయం.

కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేసిన ఈనేటి కర్ణుడు Pawan Kalyan గారు.

ఆ కుడి చేతి సాయం అందుకున్న కొంత మంది చెప్పగా, మేము శోధించగా తెలిసినవి మాత్రమే పొందుపరిచినాము, ఇంకా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సహాయం కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటూ.. ప్రజా సేవ కోసం ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం.

గత 25 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒకే ఒక్కడు జనసేనాని.