పార్టీ కోసం, ఎలెక్షన్ల కోసం ఆస్తులను అమ్ముతున్న పవన్ కల్యాణ్.

పార్టీ కోసం, ఎలెక్షన్ల కోసం ఆస్తులను అమ్ముతున్న పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ గారు వారాహి యాత్రలో మాట్లాడిన అన్ని మాటలూ అక్షర సత్యాలు.

ఆశ, ఆకలి తో ఉన్న వాడికి ఫ్రీ స్కీములు ఇస్తే పొంగి పోతాడు. డిగ్రీలు చేసిన వేల మంది వ్యక్తులు వాలంటీర్లు గా ఉండటానికి కారణం ఉద్యోగాలు లేక, ఉపాధి లేక పోవడం. నాయకుడు వాళ్లకి ఉద్యోగాలివ్వాలి. కానీ కేవలం 5000/- తో సరి పుచ్చితే తరువాత వళ్ల పరిస్థితి ఏంటి?

ఒక వ్యక్తి కి ప్రతి రోజూ నువ్వు ఒక చేప ఇస్తే ఆ రోజు మాత్రమే కడుపు నిండుతుంది. కానీ ఆ వ్యక్తికి చేపలి పట్టటం నేర్పిస్తే వాడంతట వాడు స్వయం శక్తితో బ్రతుకుతాడు.

  • జగన్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అతనివి కావు. ప్రజలవి.
  • అతను ఎలెక్షన్లకు ఖర్చుపెట్టే డబ్బులు అతనివి కావు. ప్రజలవి.
  • జాబ్ కేలెండర్లు లేని బ్రతుకులకి వాలంటీరింగ్ ఉద్యోగం కాదు. వాలంటీర్లకు ఇచ్చే డబ్బులు అతనివి కావు. ప్రజలవి.
  • లిక్కర్ ని అమ్మిన డబ్బులు అనకవుంటెడ్ మనీ.
  • కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ఏ ఒక్క మంచి పనీ చేయలేదు. ఆ డబ్బులేమయ్యాయి?

జగన్ గారు ఎలెక్షన్ ల టైం లో, సొంత దేవాలయం సెట్లు, 20 కోట్లతో ఇన్స్టాగ్రాం ఇంఫ్లుయన్సర్లను కొనడం, హెలికాప్టర్ రైడ్లకు వందల కోట్లు, సిద్ధం సభల రూపం లో వేలకోట్లు చేతులు మారడం … ఇవన్నీ ఒక వైపు.

కానీ… ఒక వైపు పవన్ కల్యాణ్…

మీరు నన్ను గెలిచినా గెలిపించక పోయినా… మీకు అర్ధం అయ్యేదాకా చెప్తూ నే ఉంటాను. ఆశతో, ఆకలితో ఉన్నప్పుడు ఫ్రీస్కీములు కళ్లకు హాయి గా కనపడతాయి. మీకు అర్ధం అయ్యేదాకా నేను మీకోసం చెప్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను.

… అని మాట్లాడిన వ్యక్తి, తన స్వంత డబ్బుని పార్టీ కోసం, ప్రజల కోసం తన స్థలాలను అమ్ముకుంటున్నాడు.

ఈ విశ్వం నిన్ను విజయ పథం లో నడిపిస్తుంది పవన్ కల్యాణ్!