జనసేన, టీడీపీ సమ్యుక్తం గా చేసిన సభ జగన్ గ్రూపులో వణుకు పుట్టించేలా జరిగింది. జనసేన మద్దతుర్దారులు, టీడీపీ మద్దతుదారులను ఎంతో సంతొషపెట్టి కార్యోన్ముఖుల్ని చేసే దిశగా సాగింది.
పవన్ కల్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా ప్రజల కోసమే మాట్లాడారు. తెలుగు ప్రజల ఎదుగుదల గురించీ, తెలుగు నేల గురించీ ఆలోచించే వ్యక్తి ఆయన. వారాహి యాత్రలలో ఎలా ఐతే జగన్ అవినీతి పాలన గురించి తెలుగు ప్రజలకు వరుసగా ఎలా తెలియజెప్పారో… అదే విధం గా ఈ సభ లో కూడా ఎంతో గొప్ప గా, ఎంతో కన్సర్న్ తో మాట్లాడారు.
తెలుగు ప్రజల మీద తనుకున్న ప్రేమ నూ, తెలుగు ప్రజలు కోల్పోయిన విలువైన 5 సంవత్సరాల సమయం గురించీ మాట్లాడారు.
నేను రాజమండ్రి వస్తున్నా అంటే భయపడి రాత్రికి రాత్రి రోడ్లు వేశావ్ జగన్.
నేను వాలంటీర్ల గురించి మాట్లాడితే డిగ్రీలు చదివిన వాళ్లని రోడ్లమీదకు పంపి గొడవ చేయించావ్
జగన్ మిమ్మల్ని సోమరులను చేసి డబ్బులిస్తాడు, సాయంత్రం మందు పోసి ఆ డబ్బులు తీసుకుపోతాడు
దాష్టీకాన్ని బద్దలు కొట్టే యువకులు జనసైనికులు. కానీ నువ్వు ఇలాంటి యువకుల్ని 5000/- కి సరిపెట్టావ్.
ఇలా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూనే ఎందుకు 24 సీట్లనే తీసుకోగలిగాం అన్న దానికి ఎంతో చక్కగా వివరించారు.
జగన్ అక్రమంగా సంపాదించినా, బాబాయి అనుమానాస్పదం గా చనిపోయినా, దళితుడిని చంపి డూర్ డెలివాఈ చేసినా, ఫీస్ రీ-ఇంబర్స్మెంట్ లు ఆపేసినా… ఇన్ని చేసినా… అతడిని ప్రశ్నించే వాళ్లు లేరు. కానీ నేను లాంగ్-టర్మ్ విజన్ తో తెలుగు ప్రజల క్షేమం తో చేసిన వ్యూగాన్ని మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఎందుకు?
ఎవరికుంది ఓపిక ఈ దేశం కోసం? నాకుంది ఓపిక. ప్రతీ తెలుగు వాడి కోసం నా ఓపిక పెరుగుతూనే ఉంటుంది.
నా దృష్టిలో నా పదవి ఎప్ప్పుడూ లేదు. ఒక్క నియోజక వర్గం మాత్రమే లేదు. నా ఆలోచన ఆంధ్ర-రాష్ట్రం మొత్తం ఉంది.
ఓడినా మీతోనే ఉంటా. గెలిచినా మీతోనే ఉంటా
పవన్ కల్యాణ్ తో స్నేహం అంటే చచ్చే దాకా. పవన్ కల్యాణ్ తో శతృత్వం అంటే ఓడిపోయేదాకా
జగన్ కి సంబంధించినంత వరకూ… పవన్ అంటే 3 పెళ్లిళ్లు, 2 విడాకులు. కానీ నాకు 4 పెళ్లాలంటాడు. జగన్ ఆ నా నాలుగో పెళ్లాం?
పవన్ కల్యాణ్ అంటే ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు, ఈ దేశపు యువత కలలు, కనీళ్లు తుడిచే చెయ్యి, ఆడబిడ్డల రక్ష, పెద్దాయన భుజం మీద కండువా.
ఇలాంటి ఉపన్యాసం తో పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులనూ, టీడీపీ కార్యకర్తలనూ కార్యోన్ముఖుల్ని చేశారు.
ఈ రాష్ట్రం బాగుపడే రోజులు రావాలని ఆశిద్దాం.