నెరవర్చిన ఒక్క హామీ లేదు. కానీ మళ్లీ ఎన్నెన్నో హామీలా జగన్?

ప్రజలకు అర్ధం ఐనట్లుంది. జగన్ నెరవర్చిన ఒక్క హామీ లేదు. కానీ మళ్లీ ఎన్నెన్నో హామీలా జగన్ అని అడుగుతున్నారు.
నెరవర్చిన ఒక్క హామీ లేదు. కానీ మళ్లీ ఎన్నెన్నో హామీలా జగన్?

జనాలు మాయ లో వోట్లు వేశారో ఏమో గానీ 151 సీట్లు ఇచ్చారు జగన్ కు. 151 సీట్లు గెలిస్తే ఎంతో ఆత్మ విశ్వాసం బలం కలగాలి కేంద్రం నుంచి ఏవైనా తెచ్చుకోవటానికి గానీ లేకా పని చేయించుకోవటానికి గానీ. కానీ ఏ ఒక్క మంచి పనీ కూడా జరగలేదు ఆంధ్ర కి అని ప్రజలు అనుకుంటున్నారు. అదీ కాక నాయకుడికి, నాయకులకీ బాగుచేయాలని ఉండాలి కదా అని కూడా అనుకుంటున్నారు.

అంత మెజారిటీ ఉండి కూడా తన మీద ఉన్న కేసుల వలన ఏ విధంగానూ జగన్ చక్రం తిప్పలేకపోయాడని అనుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. అధిష్టానం దగ్గరకు వెళ్లి అడగాలంటే ఒక రకమైన చిత్తశుద్ధి గానీ… నాలో తప్పు లేదు… మా రాష్ట్రానికి ఇది చేయండి అని అడగగలిగిన సత్తా ఉండాలి! కానీ అది జగన్ కు ఏమాత్రం ఎన్నడూ లేకపోయిందా అని ప్రజలు అనుకుంటున్నారు.

అలాంటి ఏ తప్పు చేయని నాయకుడు, చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒకడు రాష్ట్రాన్ని బాగుచేయాలని అనుకుంటున్న నాయకుడు, అధిష్టానం చక్కటి సంబంధాలున్న నాయకుడు కేవలం పవన్ కల్యాణ్ గారే అని ఆయన వారాహి సభలకు కు వచ్చే జనాలను చూస్తే అర్ధం అవుతోంది.

జగన్ అంత మెజారిటీ తో గెలిచింది కేవలం అతను ఇచ్చిన హామీల వలన. అతను ఈ సారి ఓడిపోయే ది కూడా కేవలం అతను ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవటమే అని జనాలకు ఇన్నేళ్లకైనా అర్ధం కాదని అనుకుంటున్నాడా జగన్? అనుకోడు కదా?

మరి, అంతకు మించిన ఎన్నెన్నో హామీలను మళ్లీ ఎందుకు చేస్తున్నాడు? కేవలం జనాలను మళ్లీ మభ్యపెట్టటానికేనా అని అనుకుంటున్నారు జనాలు.

ఈ సారి మాత్రం జగన్ గెలవటం చాలా కష్టమే అనీ… పక్కన పవన్ కల్యాణ్ అంత ఉన్నతమైన, అర్హత గలిగిన వ్యక్తి ఎడతెరపిలేకుండా అవినీతులని గురించి వివరిస్తుంటే జనాలు వినకుండా ఉంటారా పవన్ సీయెం కాకపోతాడా అని జనాలు గట్టిగా అనుకుంటున్నారు.