ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున ఇప్పటికైనా మేధావులు స్పందించాలని ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు మూల వ్యయాలకు కాకుండా రోజువారీ ఖర్చులకు సరిపోతున్నాయని, అప్పులు చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని మేధావి వర్గాలు వివరిస్తున్నాయి. ఇంకా అప్పులు తీసుకునే పరిధి పెంచే వెసులు బాటు కోసం చట్టాలను సవరించడం ఆందోళనను కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే భావితరాలకు ఆస్తులు ఇవ్వడం అటుంచితే.. మోయలేని అప్పుల భారాన్ని ప్రజలు తమ పిల్లలకు ఇవ్వల్సొస్తుందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ లాంటి అర్హత కలిగిన నాయకుడు వారాహి యాత్ర ల ద్వారా ప్రజలకు జగన్ ప్రభుత్వం మరియు తన అధికారులు చేస్తున్న అవినీతి గురించీ, చేస్తున్న అప్పుల గురించీ, ఏమాత్రం సద్వినియోగం గాని కేంద్రం నుంచి తెచ్చిన నిధుల గురించీ వివరించి ఏంతో మేలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలను గాలికొదిలేసి, ఇష్టానుసారంగా అప్పులు చేయడం వల్ల రాష్ట్రం దివాళా దిశగా పోతోందన్నారు. దివాళా వైపు పయనిస్తున్న రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అని ప్రశ్నించారు. పెట్టుబడులు లేకపోతే నిరుద్యోగం పెరిగి యువత ఇతర రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. సంక్షేమ పథకాలపై ముందు ప్రజల్లో మార్పు రావాలని.. అప్పుచేసి సంక్షేమ పథకాలు నిర్వహించడం వల్ల ఆ భారం రానున్న కాలంలో భావితరాలపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్ర రాష్ట్రం లో జగన్ ప్రభుత్వానికున్న వ్యతిరేకత రోజు రోజుకీ అంతకు అంత పెరుగుతోంది అని వినికిడి. కానీ తన వోటు బ్యాంకును వెర్రి వాళ్లను చేస్తూ ఇంకా ఇంకా హామీలు గుప్పించటానికి సిద్ధం సభలా అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. పవన్ కల్యాణ్ ఈ సారి వారాహి యాత్ర లో ఎన్నో విషయాలను మళ్లీ సవివరంగా వివరిస్తారనీ రాష్ట్రానికి మేలు చేసే నాయకుడు మళ్లీ వారి కోసం వస్తారని ఆంధ్రా ప్రజలు ఎదురు చూస్తున్నారు.