చాలా మంది భారతీయులు అమెరికాకు వెళ్లేది చదువుకోసం, ఉద్యోగాలకోసం అని మనందరికీ తెలుసు. కానీ, అప్పుడప్పుడు మనవాళ్లు చేసే కొన్ని పనులు చూస్తుంటే, “మనం వెళ్ళింది పని చేయడానికా లేక పరువు తీయడానికా?” అనే సందేహం రాక మానదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన (అంటే మన పరువు తీసే) ఘటనే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కానీ, అప్పుడప్పుడు మనవాళ్లు చేసే కొన్ని పనులు చూస్తుంటే, “మనం వెళ్ళింది పని చేయడానికా లేక పరువు తీయడానికా?” అనే సందేహం రాక మానదు.
అసలేం జరిగింది?
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు… పాపం, కొత్తగా అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన విద్యార్థులు లేదా కొత్త H1 ఉద్యోగులు, ఆ ఆనందంలో తమను తాము మర్చిపోతున్నారు. “అమెరికా వచ్చేసాం కదా, ఇక మన ఇష్టమే” అని రెచ్చిపోతున్నారు. కానీ ఇలాంటి పిచ్చి వేషాల వల్ల మన దేశానికి వచ్చే మంచి పేరు పోయి, అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో అత్యంత చారిత్రాత్మకమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ‘లాంగ్‌హార్న్ స్టాట్యూ’ (ఎద్దుల విగ్రహాలు) దగ్గర మనవాళ్లు కొందరు తమ ‘కళాపోషణ’ ప్రదర్శించారు. అక్కడ నిలబడి ఏదో వింత విన్యాసాలు చేస్తూ డాన్సుల వీడియోలు తీశారు. అది పాత వీడియోనా, కొత్తదా అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు అది వైరల్ అయ్యి స్థానిక అమెరికన్ల నెత్తిన పిడుగులా పడింది.
అమెరికన్ల ఆవేదన (మరియు ఆగ్రహం):
పాపం, ఆ విగ్రహాలను చూసి మురిసిపోయే స్థానికులు మనోళ్ల డాన్సులు చూసి ఇలా స్పందిస్తున్నారు:
-
ఒక స్థానికుడి సెటైర్: “150 ఏళ్ల క్రితం మా పూర్వీకుల కష్టానికి గుర్తుగా ఈ విగ్రహాలను కడితే, ఇప్పుడు ఇవి తెలుగు టిక్‌టాక్ డాన్సులకు బ్యాక్‌డ్రాప్‌లుగా మారిపోయాయి. ఇండియా! మీ వాళ్లు ఇక్కడ చేస్తున్న పనులు చూస్తుంటే మాకు చిరాగ్గా ఉంది, మీకు సిగ్గుగా అనిపించడం లేదా?” అని ఒకరు సోషల్ మీడియాలో దమ్మిక్కీ ఇచ్చారు.
-
మరో అమెరికన్ ఆక్రోశం: “ఇది టెక్సాస్.. కౌబోయ్ల గడ్డ! ఎక్కడో సముద్రాల అవతల ఉండే భారతీయులు ఇక్కడికి వచ్చి, మా టెక్సాస్‌ను ఇండియాగా మార్చేస్తున్నారేంటి? మా దేశం ఏమైపోతోంది?” అంటూ వాపోయారు.
మనోడి రివర్స్ ఎటాక్:
వీటన్నింటికీ పరాకాష్టగా, మన దేశపు ‘మేధావి’ ఒకరు ఇలా రిప్లై ఇచ్చారు: “నచ్చకపోతే దేశం వదిలి వెళ్ళిపోండి. మీ దేశం కట్టిందే భారతీయులు, మీరు దోచుకున్న భారతీయుల సొమ్ముతోనే ఇది సాధ్యమైంది. ఇది మా ‘పే-బ్యాక్’ టైమ్!” (అంటే డాన్సులు చేసి రివెంజ్ తీర్చుకుంటున్నారన్నమాట!).
డొనాల్డ్ ట్రంప్ కన్ను! H1-B ప్రోగ్రామ్!
ఒకపక్క అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తుంటేనే భయం వేస్తోంది. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్లు కలిసి H1-B ప్రోగ్రామ్ మీద భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. సాధ్యమైనంత వరకు అమెరికా పౌరులకే ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీల మీద ఒత్తిడి తెస్తున్నారు. చాలదన్నట్టు, అక్కడి స్వతంత్ర జర్నలిస్టులు ఇల్లు ఇల్లు తిరిగి మరీ ఈ H1 కంపెనీల బండారాన్ని బయటపెడుతున్నారు.
పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే, మన కుర్ర మేధావులు మాత్రం ఇలాంటి సిల్లీ పనులు చేస్తూ భారతీయుల మీద మరింత ద్వేషం పెంచుతున్నారు. ఇది రేపు పొద్దున అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే భారతీయుల ఆశల మీద నీళ్లు చల్లడమే!
గుర్తుంచుకోవాల్సిన విషయం: మీరు వేసే ఆ ఒక్క నిమిషం టిక్‌టాక్ స్టెప్పు, వేల మంది భారతీయుల కెరీర్‌ని రిస్క్‌లో పడేస్తోంది. ఇది కేవలం పరువు పోవడమే కాదు, మన భవిష్యత్తును మనమే చేజేతులా నాశనం చేసుకోవడం!
బాటమ్ లైన్: కారణాలు ఏవైనా కావచ్చు, మన సంస్కృతిని పక్కన పెట్టి, ఎదుటివారి భావాలను గౌరవించకుండా ఇలాంటి ‘రోడ్ షో’లు చేయడం వల్ల మనకే నష్టం. స్థానికులతో గొడవలు పెట్టుకోవడం, సాంస్కృతిక విభేదాలు సృష్టించడం మన సెటిలర్ల భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదు.