అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్! అశేష జన వాహిని ఆప్యాయంగా పిలిచే పేరు “అన్నయ్యా”. కోట్లమంది అభిమానులు ఇచ్చిన బిరుదు “మెగాస్టార్”. కానీ చిరంజీవి గారు వీటన్నిటినీ మించిన వ్యక్తి. ఆయన చేపట్టిన ప్రజాసేవ కార్యక్రమాలు, సినీ పరిశ్రమకు చేసిన సేవలు, రక్తదాన దాన సేవా శిబిరాలు ఆయనను ఇంత ఎత్తుకి తీసుకెళ్లాయి.
74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు-జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడులను పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక 110కి పద్మశ్రీ, 17 మందికి పద్మ భూషణ్ అవార్డు లను ప్రకటించింది.
చిరంజీవి గారి మాటల్లో …
పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలియగానే ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. మన దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు చాలా సంతోసంగా ఉంది. తమ కన్నతల్లి కుటుంబంలో పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ఆశీస్సులు. నా సినీ కుటుంబం అండదండలు, నన్ను నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ఆదరణ, ప్రేమ, అభిమానుల కారణంగానే నేను ఈ స్థితిలో ఉన్నాను.