ఆలోచింపజేస్తున్న జనసేన ఎన్నికల ప్రచార వీడియోలు

ఆలోచింపజేస్తున్న జనసేన ఎన్నికల ప్రచార వీడియోలు

బూతులతో ఒక నలుగురు ముగ్గురు చేసే విమర్శలు అసహ్యాన్ని కలిగిస్తాయి. ఆ ముగ్గురూ నలుగురూ మంతృలైతే జుగుప్సనీ, వ్యవస్థ మీద అసహ్యాన్నీ కలిగిస్తాయి.

దీనికి విభిన్నంగా ఎప్పటిలానే పవన్ కల్యాణ్ అధీనం లో జనసేన ప్రస్తుత గవర్నమెంట్ పనితీరు మీద ఎన్నికల వేళలో చాలా చిన్నవైనటువంటి అర్ధవంతమైన, ఆలోచింపజేసేటటువంటి ప్రచార వీడియోలను విడుదల చేసింది.

ఈ వీడియోల నిడివి చాలా తక్కువ. కానీ ఒక్కొక్క వీడియో రామ బాణం లా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిక్కచ్చి గా ఆలోపించజేసే విధం గా ఉన్నాయి. సామాజిక మాద్యమాలలో వీటి గురించిన చర్చ జోరుగా సాగుతోంది.

ఏ వయసు వారికైనా ఇట్టే అర్ధం అవుతాయి. ఒక్క అసహ్యపు మాటలేదు. వెక్కిలి చేష్టలు లేవు. సామాన్య ఆంధ్ర పౌరుడు పడుతున్న కష్టాన్ని ఒక్క నిమిషం వ్యవధిలో ఇంత చక్కగా అభివర్ణించిన తీరు ప్రశంసనీయం.

రాబోయే కాలం ఆంధ్ర రాష్ట్రానికి బాగుంటుందని ఆశిద్దాం.

ఈ క్రింద ఆ వీడియోలను చూడండి.