నానాటికీ సిద్ధం సభలు విచక్షణ కోల్పోయిన, దారి తెలియని యువకుల సమూహం గా మారుతున్నాయని ప్రజల అభిప్రాయం. జగన్ ప్రభుత్వపు విలవలనీ, యువతను ఆ ప్రభుత్వం అలా చూడాలనుకుంటొందా ఈ మద్యం అమ్మకాలతో, పెరుగుతున్న మాదక ద్రవ్యాలతో నూ అని ప్రజలు విశ్వసిస్తున్నారు.
సిద్ధం సభలలో ఇస్తున్న హామీల ద్వారా గానీ… లేక జగన్ మాట్లాడుతున్న తీరుని బట్టి గానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమాత్రం ఆశాజనకం గా ఉండదని అభిప్రాయపడని తెలుగు వ్యక్తి లేడు.
ఇటీవల జరిగిన సిద్ధం సభలో విచక్షణ లేని యువకుల ప్రవర్తన బాధ్యత కలిగిన ఏ మనిషికైనా జుగుప్స కలిగించే విధం గా ఉంది. అదీ కాక, సిద్ధం లాంటి సభలు వాటిని నడుపుతున్న నాయకుల అనుమతి లేకుండా జరుపబడవు కదా?
అలాంటి సభలలో రాజకీయనాయకుల క్యారికేచర్లని పెట్టి, వాటిని కొట్టించటం, వాటిని వాళ్లు ఆనందించడం దారి తప్పిన యువతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ గారు వాలంటీర్ల గురించి ఆవేదన చెందిన తీరు, ఆ ఆవేదన కు అర్ధం రోజు రోజు కీ పెరుగుతుండటం గమనార్హం. ఎలాగైతే యువత మారకూడదని పవన్ కల్యాణ్ గారు అనుకున్నారో, అలానే సిద్ధం సభలలో ఉన్న వారి ప్రవర్తన అత్యంత శోచనీయం.
ఇది అత్యంత బాధాకరమైన విషయం. ప్రభుత్వం మారాలాని ప్రజలు విశ్వసిస్తున్నారు.