సినీ నటుడు, నిర్మాత నాగార్జున గారి ఇంట్లో మళ్లీ శుభ సమయాలు మొదలయ్యాయి.
నాగ చైతన్య, సమంత లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో నాగ చైతన్య ని తప్పు పట్టని వ్యక్తి లేడు. సాధారణం గా సమాజం ఆడవాళ్లను వెనకేసుకొని వస్తుంది. అదే సమంత విషయం లో నూ జరిగింది - ఏ ఒక్కరికీ అసలైన విడాకుల-కారణాలు తెలియకపోయినా. విడాకులనేవి మగవారికి కూడా కష్టాలు కలిగించే ఘట్టమే జీవితంలో.
కానీ నాగ చైతన్య ఎంతో హుందాగా, ఏ మాత్రం తొణకకుండా, ఏ ఒక్క ఇంటర్వ్యూ లో నూ గోప్యంగా, వ్యంగ్యం గా సమాధానాలు ఇవ్వకుండా, నోరు జారకుండా, తన లో ని బాధ ను లోపలే ఉంచుకొని తన చిత్రాల ప్రమోషన్ ఇంటర్వ్యూల లో పరిపక్వతను ప్రదర్శించాడు.
ఏ వ్యక్తి ఐనా - ఆడా మగా తేడా లేకుండా - ఒక సారి విడాకులు అవ్వగానే తన జీవితం అక్కడితో ఆగాల్సిన అవసరం లేదు. ఎవరి జీవితం వాళ్లది. వేరే వాళ్లని ఇబ్బంది పెట్టకుండా, మాట అనకుండా ఎవరి జీవితాలను వాళ్లు హాయి గా నడుపుకోవచ్చు. అలానే నాగ చైతన్య శోభిత ప్రేమ లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తల్లో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.
కానీ హటాత్తుగా నాగచైతన్య, శోభితల నిశ్చితార్ధపు వార్త కొంత మంది ని షాక్ చేసి ఉండచ్చు. కానీ… ఇది అందరూ సంతోషించి చైతన్య ను ప్రేమగా హృదయం తో దీవించాల్సిన విషయం.
నాగ చైతన్య సంతోషం గా, పిల్లా పాపలతో, ఆనందం గా ఉండాలనీ, తను చేసే నటనావృత్తిలో మరింత రాణించాలని ఆశిద్దాం.