పవన్ కల్యాన్ ర్యాలీలు ఆంధప్రదేశ్ లో ఎంతో కన్నులపండువగా, జనరంజకంగా సాగుతున్నాయి. ప్రజలు ఎక్కడ చూసినా పవన్ కల్యాణ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన చెప్పేమాటలను మనసుకెక్కించుకుంటున్నారు.
ఈ క్రింద రాజోలు గురించి చెప్పిన వాక్యాలు జనసేన ట్విటర్ అధికారిక హ్యాండిల్ ప్రచురించినవి.
జనసేన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టనున్న రాజోలు
రాజోలు నుండి మొదలైన జనసేన విజయ ప్రస్థానం, మరోసారి చారిత్రాత్మక ప్రజా తీర్పుకు వేదిక కానుంది.
రాజోలు గడ్డ - జనసేన అడ్డా ✊
---
రాజోలు అనే పదం కోనసీమ కొబ్బరి బొండాం ఎంత తీయగా ఉంటుందో అంత తియ్యగా ఉంటుంది, మబ్బులు కమ్మిన చోట, వెలుతురు లేని, గాడాంధకారం ఉన్న చోట వెలుగురేఖ రాజోలు
ఇంకా మనకు 18 రోజులు మిగిలి ఉంది, 5 ఏళ్లుగా రోడ్ల మీద ఉన్నాం, మనవల్ల రాజకీయం అవ్వదు అని అందరూ అన్నా సరే మీ మీద నమ్మకంతో నేను 10 ఏళ్లుగా జనసేనను నిలబెట్టాను, గెలిపించుకోవాలి
2022 లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు, రైతులు ఎకరానికి 25 వేలు, కౌలు రైతులు 50 వేలు నష్టపోతున్నాం అని చెప్పారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరిగా అమ్మకాలు జరగట్లేదు, అమ్మినా డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదు, పంట కాలవల పూడిక తీయడం లేదు, మరమ్మత్తులు చేయడం లేదు, కాలవ గట్టులను డంపింగ్ యార్డు గా మార్చింది YSR Congress Party - YSRCP ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, దేవ వరప్రసాద్ గారు ఎంఎల్ఏ అభ్యర్థి అయినప్పటికీ, రాజోలు రైతుల సమస్యల పరిష్కారానికి నేను భాధ్యత తీసుకుంటాను
ధవళేశ్వరం నుండి అంతర్వేది వరకు ఉన్న నీటి కాలవల్లోకి వ్యర్థాలు చేరి పూడిక పెరిగిపోయింది, ఈ సమస్య మేము పరిష్కరించి రైతులకు అండగా ఉంటాం
ఇక్కడ MLA రాపాక 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు తప్ప రైతుల కష్టాలు తీర్చలేకపోయాడు
రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే కో ఆపరేటివ్ సంస్థలను నిర్వీర్యం చేశారు, రైతాంగానికి సంబంధం లేని MLC అనంత బాబును చైర్మన్ గా చేసారు, అతను దళిత డ్రైవర్ ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రైతుల గురించి ఎందుకు ఆలోచిస్తాడు
వైసీపీ ప్రజల మధ్య గొడవలు పెట్టడం కోసమే అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు విషయంలో అవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టింది వైసీపీ , ఆ గొడవల్లో కీలక వ్యక్తి ఇప్పుడు మంత్రి విశ్వరూప్ వెనుక ఉన్నాడు
అంతర్వేది లో రథాన్ని తగలబెడితే తేనెటీగల పేరు చెప్పాడు YS Jagan Mohan Reddy, చిన్న గులకరాయి వేస్తే నిందితుడిని 2 రోజుల్లో పట్టుకున్నారు, అంతర్వేది రథం విషయంలో ఈరోజుకు నిందితులను పట్టుకోలేదు
భీమ్లా నాయక్ సినిమా, వకీల్ సాబ్ సినిమా అడ్డుకోవాలని చూసిన వ్యక్తి జగన్, నేను వెళ్లి జగన్ ను బ్రతిమిలాడతాను అనుకున్నాడు, అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్ లో వదిలేసే వ్యక్తిని నేను, నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను
సఖినేటిపల్లి - నరసాపురం మధ్యలో వశిష్ఠ వారధి నిర్మిస్తాం, కోనసీమకు రైల్వే మార్గం తీసుకొస్తాం, టూరిజం అభివృద్ది చేస్తాం
ప్రభుత్వం సంపద సృష్టించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అప్పుడే ప్రజలకు అప్పు చేయకుండా పథకాలు అందించగలం, మేము సంపద సృష్టించే విధానాలు తీసుకొస్తాం, సంక్షేమం తో పాటుగా అభివృద్ది చేసి చూపిస్తాం
కేంద్రంలో మాట్లాడి DCI డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసేలా చూస్తాను, దిండి రిసార్ట్స్ కేరళ తరహా టూరిజం డెవలప్ చేస్తాం, అన్నా చెల్లెలు గట్టు టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
రాజోలు ను ONGC స్మార్ట్ సిటీగా చేస్తాం అని ముందుకు వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం ముందుకు రాలేదు, మేము అధికారంలోకి వచ్చాక రాజోలు ను స్మార్ట్ సిటీ గా చేస్తాం