![ఎలక్షన్ టైం లో వాలంటరీ వ్యవస్థను వాడకూడదని EC కి ప్రత్యేకంగా వివరించిన Pawan Kalyan గారు](https://res.cloudinary.com/acentral/image/upload/v1704842667/pawank/cr-20230712en64aee4b52268e_pxtunm.jpg)
పవన్ కల్యాణ్ గారి వారాహి యాత్ర పుణ్యమా అని తెలుగు ప్రజలందరికీ వైసీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ వలన జరిగే తప్పుడు పనులు చాలా బయటకు తెలిశాయి. ఇప్పటికే చాలా మంది ప్రజలు ఇంటి తలుపు తడుతున్న వాలంటీర్ ల ను ఇంట్లోకి రానివ్వకుండానే వెళ్లిపొమ్మంటున్నారు.
అంతే కాక పవన్ కల్యాణ్ గారు ఎంతో ప్రేమ గా వాలంటీర్ల గురించి, “నేను మీకు 5000 రూపాయలు వస్తుంటే ఇంకా మరొక 5000 రూపాయలు మీకు రావాలి అని కోరుకునే వాడిని. మీరు నేను చెప్పేది అర్ధం చేస్కోండి. మీ బ్రతుకుల ను 5000 రూపాయల దగ్గరే ఆపేశాడు జగన్” అన్న మాటలు ఎంతో సూటిగా యువత మనసులనూ, ఆంధ్రా ప్రజల ఆలోచనలనూ చేరాయి. మరీ ఎక్కువ గా వైసీపీ వాలంటీర్లకే ఎంతో సున్నితం గా ప్రేమగా తగిలాయి, వాళ్లని ఆలోచింపజేశాయి. ఆ వారహి యాత్ర సభ తరువాత పవన్ కల్యాణ్ గారి మీదకు చాలా మంది ని వైసీపీ పార్టీ ఉసిగొల్పిందని భోగట్టా.
వైసీపీ పార్టీ ఎలా ఐతే ఈ వాలంటీర్ వ్యవస్థ తో ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి హైదరాబాదు లో ని ప్రైవేటు సంస్థల డేటాబేసుల్లో నిక్షింప్తం చేస్కుందో… అదే విధం గా ఏ కుటుంబం ఏ పార్టీ కి సుముఖం గా ఉన్నదో అనే సమాచారం కూడా ఇప్పటికే సేకరించదని ప్రజల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎందరో మనుషుల వోటరు కార్డులు గల్లంతైపోయాయి. ఆ గల్లంతు ఐన వోట్లన్నీ జనసేన, టీడీపీ వైపు మొగ్గు చూపే కుటుంబాలవే కావటం గమనార్హం అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఎలెక్షన్ కమీషన్ ప్రకారం ఎన్నికల సమయం లో ఎలాంటి మీడియా ద్వారా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ ప్రచారాన్ని సాగించ కూడదు అనేది నియమం. కానీ వాలంటీర్ల కు, ఆ వ్యవస్థకు అలాంటి నియామలు లేవు. కానీ అలాంటి నియమాలు ఉండాల్సిన పరిస్థితి ఎక్కువ గా కనపడుతోంది.
ఈ విషయం దృష్ట్యా పవన్ కల్యాణ్ గారు ఎలెక్షన్ కమీషన్ కి ఈ విషయాన్ని సూచించారు - ఎలెక్షన్ సమయం లో జగన్ ఇంటింటికీ ఈ వాలంటీర్లను పంపి లోపాయకారిగా ప్రచారం సాగిస్తాడని. చాలినా చాలకపోయినా పాపం ఆ కొద్దిపాటి డబ్బులకోసం వాలంటీర్లు ఆ పనిని చేస్తారు. అలాంటి వాలంటీర్లకు మంచి జీవితాన్ని అందించాలనే పవన్ కల్యాణ్ గారి ముఖ్య ఉద్దేశ్యం.