జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు ఈ నెల నాలుగవ తారీఖు నుంచి మూడు నాలుగు రోజుల పాటు కాకినాడ లో బసచేయనున్నారు. డిసెంబరు 28, 29, 30 తేదీల్లో సమీక్షలు ఉంటాయి.
ఈ నెల 4న ఉదయాన్నే కాకినాడ చరుకోనున్న పవన్ కల్యాణ్ నగరంలోని 28 డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళలు, తటస్థులతో వివిధ విషయాలమీద చర్చలు జరుపుతారు. అనంతరం అమలాపురం, రాజమహేంద్రవరం లోక్ సభ పరిథిలోని అసెంబ్లీ స్థానాల వారీగా ఇంచార్జీలతో ముఖాముఖి నిర్వహిస్తారు.
చివరి రోజు ఉమ్మడి జిల్లా జనసేన శ్రేణులతో సమ్యుక్తం గా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు పవన్ కల్యాణ్ గారితో పర్యటిస్తారు.