జనసేన అధికార నాయకుడు పవన్ కల్యాణ్ నెమ్మదిగా తన పని చేస్కుంటూ పోతూనే ఉన్నారు. హెలికాప్టర్ ఆపితే ఏంటి? రోడ్లు బ్లాక్ చేస్తే ఏంటి? పని చేయాలని ఉన్నప్పుడు ఆ పని ఎలా ఐనా ధర్మం గా చేయచ్చు.
పవన్ కల్యాణ్ తన అభ్యర్ధులను కలుస్తూనే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు కృషి చేస్తున్నారు. జనసేన తన అధికారిక ట్విటర్/ఎక్స్ ప్లాట్ఫాం లో పోస్ట్ చేసిన విషయం పార్టీ శ్రేణుల్లో మరింత బలాన్నీ, ఆత్మవిశ్వాసన్న్నీ నింపింది.
మనం గెలుస్తున్నాం. గెలిచి తీరుతున్నాం. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం
అన్న ఆత్మవిశ్వాసపు-వచనం తన పార్టీ శ్రేణులు, జనసేన, పవన్ కల్యాణ్, మహేష్ బాబు అభిమానులు “షేర్” చేయ్టం తో వర్గాల్లో ఆత్మవిశ్వాసం మరింత పుంజుకుంది.
అలా జరుగుతూ ఉండగా సిద్ధం సభలలో కుర్రకారు చేస్తున్న వికృత చేష్టలు ప్రజలలోకి వెళ్లి ప్రభుత్వం మారాల్సిన అవసరాన్ని ని తేటతెల్లం చేశాయని ప్రజల అభిప్రాయం.