By Prakash Reddy
నాలుగున్నర సంవత్సరాలు వ్యర్థం. చివరి 6 నెలలు అది చేస్తా ఇది చేస్తా అని మాటలు. సిద్ధం అని మేకపోతు గాంభీర్యం. దేనికి సిద్ధం?
ఈ సినిమాల వల్ల ఏంటి ఉపయోగం? వేరే వాళ్ల సినిమాలకు 5/- టికెట్టులు. వేరేవాళ్ల మీద బురద చల్లేలా సమాజం సిగ్గుపడే డైరెక్టర్లతో సినిమాలా అని ప్రజలు ముచ్చటిస్తున్నారు.
రాజకీయాలు, వాటిని గురించిన చర్చలు అన్నీ చాలా ఇష్టం మన తెలుగు ప్రజలకు. రాజకీయ నాయకులు ముచ్చట్లు చెప్తారనీ తెలుసు. వాటిని నెరవేర్చే వారూ ఉండరని తెలుసు. కానీ ఏ పార్టీ కి సపోర్ట్ చేసేవాళ్లు ఆ పార్టీ నాయకుల్ని వెనకేసుకుని వస్తారు. రాష్ట్రం నాశనం ఐన పరిస్థితినీ పట్టించుకోరు.
ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఎన్ని సంవత్సరలాయ్యింది? మన గతి ఏంటి అని కూడా లేకుండా ఏ పార్టీనైనా సపోర్ట్ చేసే వ్యక్తులున్నారు.
ప్రజల అభిప్రాయం ఏంటంటే - “YSRCP ప్రభుత్వం మొదటి నాలుగున్నర సంవత్సరాలూ ఏమీ చేయకుండా, రోడ్లను బాగు చేయకుండా, ఎలెక్ట్రికల్ డెపార్టుమెంటు ని గానీ, ఆర్టీసీ ని గానీ అసలు ఏ ఒక్క వ్యవస్థనూ బాగు చేయకుండా… కేవలం ఫ్రీస్కీముల పేరుతో ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా… మద్యం తో డబ్బులు గడించి, ప్రతిపక్షాల మీద అవాకులూ చవాకులూ… పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, ఏదో ఒక గొడవ చేసి, అసలు విషయాన్ని పక్కన పెట్టి సమయం గడిపి, ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడీ, మేకపోతు గాంభీర్యం, ప్రదర్శించి, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరు నమ్ముతారు?” అని.
అసలు మన రాష్ట్రానికి ఏంటి ఈ పరిస్థితి అని ప్రజల బాధ.?