
పవన్ కల్యాణ్ హనుమత్‌జయంతి పర్వదినాన తన నామినేషన్ ను పిఠాపురం లో దాఖలు చేశారు. జనసేన కార్వవర్గం శుభాకాంక్షలందించారు.
పవన్ కల్యాణ్ అభిమానులైన రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు, పిటాపురం ప్రజలు తండోపతండాలు గా పవన్ వెంట నామినేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఏ నాయకుడికైనా అసూయ కలిగించేలా జనం తరలి వచ్చారు. ఉవ్వెత్తున జన తరంగం లేచి పడింది. పవన్ కల్యాణ్ తన కారులో పిటాపురం నేల ప్రజలకు అభివందనం చేస్తూ ఆద్యంతం సాగారు. తన వెంట వచ్చిన జనాలకు అభినందనలను, ధన్యవాదాలను తెలుపుతూ తన సౌశీల్యాన్ని చాటుకున్నారు.
పిఠాపురం నేల పవన్ కల్యాణ్ కు ఎన్నడూ చూడని మెజారిటీని ఇవ్వటానికి సిద్ధం గా ఉంది.
హనుమంతుడి ఆశీస్సులు, విజయలక్ష్మి దీవెనలు పవన్ కల్యాణ్ వెంట, మన రాష్ట్రానికి ఉండాలని ఆశిద్దాం.