పవన్ తాడు లాగాడు. తమిళనాటి హిందూవ్యతిరేక డొంక కదిలింది.

పవన్ తాడు లాగాడు. తమిళనాటి హిందూవ్యతిరేక డొంక కదిలింది.

తిరుమల తిరుపతి ప్రసాద విషయమైల్ ఇప్పటికీ పోరాటం చేస్తున్న పవన్ కల్యాణ్, సనాతన ధర్మ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు. హిందూ ధర్మాన్ని తూలనాడితే ఊరుకోబోమని చెప్తూనే పరమత సహనం హిందువులలో అత్యంత ఎక్కువ అనీ, సెక్యులర్ భావాలు హిందువులకే కాదు వేరే వాళ్లకూ ఉండాలనీ, సెక్యులర్ భావజాలం పరస్పరం ఉండాలనీ సూచించారు.

తిరుమల తిరుపతి కి నెయ్యి ని సప్లై చేసిన కంపెనీ నే తమిలనాటి ఆలయాలకు కూడా సప్లై చేసిందని తెలిసిన విషయమే. తమిళనాడు లో బాహటంగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ నిర్మూలన గావిస్తామని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని, తమిళనాడు లో ని దేవాలయాల మీద ఉన్న చిన్న చూపునూ మళ్లీ గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ తనదైన శైలి లో విరుచుకు పడ్డారు. పవన్ కల్యాణ్ మీద డీ-ఎం-కే మద్దతుదారులు ట్విటర్ వేదికగా మాటలు తూలనాడారు.

ఈ తరుణం లో పవన్ కల్యాణ్, జనసేన మద్దతుదారులో ఏమాత్రం సహించకుండా ఇవ్వవలసినదానికంటే ఎక్కువ మోతాదులోనే తిరిగి సమాధానం చెప్పారు.

ఇది ఇలా ఉండగా, ఉత్తర భారత దేశం లో పవన్ కల్యాణ్ పేరు మారు మ్రోగిపోతోంది. సనాతన ధర్మాన్ని దక్షిణ భారత దేసం లో కాపాడటానికి పవన్ ముందుంటారనీ, రాబోయే రోజులలో పవన్ కల్యాణ్ జాతీయ నేత గా ఎదుగుతారనీ టీవీ చానెళ్లూ, ట్విటర్ ప్రముఖులూ పేర్కొన్నారు.

ఏది ఏమైనా హిందువుల పరిస్థితి తమిళనాడులో ఏమాత్రం బాలేదు. పవన్ కల్యాణ్ తనదైన శైలిలో తమిళనాటి రాజకీయాన్ని కుదిపారు.